© vv - 2026
ధోనీ రిటైర్మెంట్ సరైన నిర్ణయమే: ఇషాన్ కిషన్ ప్రశంసలు క్రీడలు
gunugu
gunugu
ChiefEditor
⚡ Digital Edition
🗓 25 Nov 2026, 11:51 AM

ధోనీ రిటైర్మెంట్ సరైన నిర్ణయమే: ఇషాన్ కిషన్ ప్రశంసలు

ఐపీఎల్ : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. దేశం కోసం ధోనీ చేసిన సేవలు ఎనలేనివని, అతని స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని కొనియాడాడు. పాట్నాలో విలేకరులతో మాట్లాడిన ఇషాన్, ధోనీ రిటైర్మెంట్ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. రిటైర్మెంట్ కు సమయం వచ్చిందని అతడు భావించాడు.

ఏఐతో సైబర్ దాడులు.. కార్పొరేట్ సంస్థలకు సిస్కో సీఈవో హెచ్చరిక! టెక్నాలజీ
gunugu
gunugu
ChiefEditor
⚡ Digital Edition
🗓 25 Nov 2026, 11:04 AM

ఏఐతో సైబర్ దాడులు.. కార్పొరేట్ సంస్థలకు సిస్కో సీఈవో హెచ్చరిక!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సైబర్ నేరగాళ్లు భద్రతా లోపాలను వేగంగా గుర్తిస్తూ దాడులకు తెగబడుతున్నారని సిస్కో సీఈవో చక్ రాబిన్స్ హెచ్చరించారు. సంస్థలు తమ వ్యవస్థలను అప్‌డేట్ చేసుకునే వేగం కంటే హ్యాకర్ల దాడి వేగమే ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ముప్పును ముందే గుర్తించి సైబర్ భద్రతను పటిష్టం చేసుకోవాలని కార్పొరేట్ దిగ్గజాలకు పిలుపునిచ్చారు.

ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల! సినిమా
gunugu
gunugu
ChiefEditor
⚡ Digital Edition
🗓 17 Nov 2026, 12:28 PM

ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ఓం సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీలీల ధనుష్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్! సినిమా
gunugu
gunugu
ChiefEditor
⚡ Digital Edition
🗓 13 Nov 2026, 10:39 AM

‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న 'కాకా' సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న రూమర్లకు రచయిత కోన వెంకట్ చెక్ పెట్టారు. సంక్రాంతి రేసు నుంచి సినిమా తప్పుకోవడం లేదని, చెప్పినట్లుగానే జనవరి 13నే సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో నెలకొన్న వాయిదా రూమర్లకు పూర్తిగా తెరపడింది.

ఖాజాగూడలో రూ.1000 కోట్ల భూ కుంభకోణం: రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు తెలంగాణ
gunugu
gunugu
ChiefEditor
⚡ Digital Edition
🗓 12 Nov 2026, 10:24 AM

ఖాజాగూడలో రూ.1000 కోట్ల భూ కుంభకోణం: రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్ ఖాజాగూడలో బీసీ స్టడీ సర్కిల్ కోసం కేటాయించిన 3.17 ఎకరాల విలువైన భూమిని సాస్ ఇన్‌ఫ్రా సంస్థకు అక్రమంగా కట్టబెట్టారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించిన ఆయన, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విమర్శించారు.

ఆర్టీఐ సమాచారం ఇవ్వని అధికారులకు నోటీసులు: నవంబర్ 12న కమిషన్ విచారణ తెలంగాణ
gunugu
gunugu
ChiefEditor
⚡ Digital Edition
🗓 11 Nov 2026, 07:33 PM

ఆర్టీఐ సమాచారం ఇవ్వని అధికారులకు నోటీసులు: నవంబర్ 12న కమిషన్ విచారణ

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం ఇవ్వని అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్డీఓ, నాయబ్ తహసీల్దార్ నవంబర్ 12న హైదరాబాద్‌లో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తుదారుడికి సమాచారం అందించడంలో జరిగిన జాప్యంపై వివరణతో పాటు సంబంధిత రిజిస్టర్లను సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.

ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్‌గా పనికిరానంది! సినిమా
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:37 AM

ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్‌గా పనికిరానంది!

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తాను హీరోయిన్ అవ్వడం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదన్న షాకింగ్ నిజాన్ని జాన్వీ తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా తన రైనోప్లాస్టీ జరిగిన తర్వాతే తనపై శ్రీదేవికి నమ్మకం కుదిరిందని జాన్వీ పేర్కొంది.

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. సినిమా
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:35 AM

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే..

కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ల పెళ్లి మూహూర్తం దగ్గర పడింది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు వెన్యూకి చేరుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కుటుంబ సమేతంగా గ్రీస్ దేశానికి బయలుదేరారు.

‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర? తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:34 AM

‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’కు ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన దక్కుతోంది. నవంబర్ 5న రిలీజైన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కొల్లగొట్టింది. రామాయణ గాథకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా పైనా ఆసక్తి పెరుగుతోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ. అంతర్జాతీయం
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:33 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ.

ఉక్రెయిన్-రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలకాలనే లక్ష్యంతో దౌత్యపరమైన ప్రయత్నాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో సోమవారం టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:32 AM

అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) తమ దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో ఈ జంట తమ విడాకుల నిర్ణయాన్ని ధ్రువీకరించింది.

హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు.. తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:32 AM

హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే లక్డీకాపూల్ జంక్షన్‌లో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర ట్రాఫిక్ పోలీస్, జీహెచ్‌ఎంసీ విభాగం నడుం బిగించాయి. రవీంద్రభారతి – లక్డీకాపూల్ – ఇక్బాల్ మినార్ కూడళ్ల మధ్య ప్రతిపాదిత ‘వన్ వే’ విధానాన్ని నవంబర్ 22వ తేదీ (ఆదివారం) ఒక రోజు పాటు ప్రయోగాత్మకంగా (ట్రయల్ రన్) అమలు చేయాలని నిర్ణయించాయి. అమలుకు అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు.

హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ.. తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:31 AM

హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..

హైదరాబాద్ వేదికగా కార్పొరేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న దోపిడీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ‘పిన్ సర్వే’ సంస్థను టార్గెట్ చేసిన హ్యాకర్లు, కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా రూ. 8 కోట్లను కొల్లగొట్టారు. కంపెనీ బ్యాంకింగ్ నెట్‌వర్క్ భద్రతా లోపాలను ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, కంపెనీ అధికారిక ఖాతాలను హ్యాక్ చేశారు.

హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం.. తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:31 AM

హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..

తెలంగాణ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను వారి సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సదుపాయాలను పెంచుతున్నామని వెల్లడించారు.

ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.! తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:30 AM

ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!

బడిలో చదువుతున్న ప్రతీ పిల్లాడూ ప్రత్యేకమే.. కానీ, కొందరు చిన్నారుల్లో ఉండే ప్రత్యేక అభ్యాసన లోపాలు లేదా దివ్యాంగత్వాన్ని సకాలంలో గుర్తించకపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ‘ప్రశస్త్’ (PRASHAST) కార్యక్రమాన్ని అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు తెలంగాణ
Mani Sakshi
Mani Sakshi
ChiefEditor
⚡ Digital Edition
🗓 10 Nov 2026, 01:29 AM

తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు

రాష్ట్రంలో బియ్యం అక్రమాలు, అధిక ధరల విక్రయాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2,686 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తూ, వినియోగదారులను మోసగిస్తున్న వ్యాపారులను గుర్తించి ఇప్పటివరకు 370 కేసులు నమోదు చేశారు.