© vv - 2026

Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!

gunugu
gunugu Chief Editor
|
|
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
News Clip
◉ Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
◉ Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్‌ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్..
◉ Huawei Mate X8 వచ్చేస్తోంది
◉ Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్‌లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
◉ Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ వారం (నవంబర్ 16 – నవంబర్ 22) పండగ వాతావరణం తీసుకురానుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఒప్పో, షియోమీల నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 16న ఒప్పో రెనో 17 సిరీస్‌ను చైనాలో విడుదల చేయనుండగా.. నవంబర్ 17న షియోమీ 18 ప్రో సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.

ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో లాంచ్

ఒప్పో నుండి కొత్త రెనో 17 సిరీస్‌ను నవంబర్ 16న చైనాలో విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇందులో ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో స్మార్ట్‌ఫోన్లను launch చేయనున్నారు. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే ఈవెంట్‌లో ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 ట్యాబ్లెట్, ఒప్పో వాచ్ 5 స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ల డిజైన్ ఇప్పటికే వెల్లడైంది. ముఖ్యంగా రెనో 17 అడ్వెంచర్ క్యాట్ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బ్లూ లైట్‌లో ఈ ఫోన్ వెనుక భాగం మెరిసేలా ప్రత్యేక డిజైన్‌ను అందించారు. కోకో బ్రౌన్, ఫస్ట్ స్నో వైట్, ఐస్ మూన్ వైట్ కలర్ ఆప్షన్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌లో 6.56 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేయనున్న ఈ ఫోన్‌లో భారీ 8,000mAh బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెనో 17 ప్రో మోడల్ కొంత కాంపాక్ట్ డిజైన్‌తో రానుంది. ఇందులో 6.32 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్‌సెట్ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండనుంది. రెండు ఫోన్లలోనూ మెటల్ ఫ్రేమ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించనున్నారు.

కెమెరాల విషయానికి వస్తే.. రెనో 17, రెనో 17 ప్రో రెండింటిలోనూ 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ప్రో మోడల్‌లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్లు రావచ్చు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17తో పనిచేయనున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ల విడుదలపై ఒప్పో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రెనో 17 మోడల్ 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. దీనితో పాటు రెనో 17c కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. కానీ రెనో 17 ప్రో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం.

Share

మరిన్ని కథనాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నూతన సంచలనం: సరికొత్త AI టూల్స్ - ప్రత్యేక తాజా కథనం #8 టెక్నాలజీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నూతన సంచలనం: సరికొత్త AI టూల్స్ - ప్రత్యేక తాజా కథనం #8

సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు: కెమెరా మరియు బ్యాటరీ అప్‌గ్రేడ్స్ - ప్రత్యేక తాజా కథనం #26 టెక్నాలజీ

సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు: కెమెరా మరియు బ్యాటరీ అప్‌గ్రేడ్స్ - ప్రత్యేక తాజా కథనం #26

భారత్‌లో 5G నెట్‌వర్క్ విస్తరణ ముమ్మరం: గ్రామీణ ప్రాంతాలకు సూపర్ స్పీడ్ - ప్రత్యేక తాజా కథనం #17 టెక్నాలజీ

భారత్‌లో 5G నెట్‌వర్క్ విస్తరణ ముమ్మరం: గ్రామీణ ప్రాంతాలకు సూపర్ స్పీడ్ - ప్రత్యేక తాజా కథనం #17

క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ భవిష్యత్తు: పరిశ్రమల సమూల మార్పులు - ప్రత్యేక తాజా కథనం #53 టెక్నాలజీ

క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ భవిష్యత్తు: పరిశ్రమల సమూల మార్పులు - ప్రత్యేక తాజా కథనం #53

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో విప్లవం: వేగంగా పెరుగుతున్న చార్జింగ్ స్టేషన్లు - ప్రత్యేక తాజా కథనం #44 టెక్నాలజీ

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో విప్లవం: వేగంగా పెరుగుతున్న చార్జింగ్ స్టేషన్లు - ప్రత్యేక తాజా కథనం #44

సైబర్ సెక్యూరిటీ భద్రతా మార్గదర్శకాలు: ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ - ప్రత్యేక తాజా కథనం #35 టెక్నాలజీ

సైబర్ సెక్యూరిటీ భద్రతా మార్గదర్శకాలు: ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ - ప్రత్యేక తాజా కథనం #35

రోబోటిక్స్ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు: పారిశ్రామిక ఆటోమేషన్ - ప్రత్యేక తాజా కథనం #80 టెక్నాలజీ

రోబోటిక్స్ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు: పారిశ్రామిక ఆటోమేషన్ - ప్రత్యేక తాజా కథనం #80

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో డిజిటల్ డేటా రక్షణ: సరికొత్త భద్రతా ప్రమాణాలు - ప్రత్యేక తాజా కథనం #71 టెక్నాలజీ

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో డిజిటల్ డేటా రక్షణ: సరికొత్త భద్రతా ప్రమాణాలు - ప్రత్యేక తాజా కథనం #71

Generating 2K HD News Clip...