కేసీఆర్ పాలనపై ప్రశంసలు.. కరోనా కష్టకాలం గుర్తింపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై, కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు మాని ప్రజలకు నీళ్లు, కరెంట్ అందించడంపై దృష్టి పెట్టాలని హరీశ్ రావు హితవు పలకారు. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ కనుక సీఎంగా ఉంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి తెలంగాణకు కరువు రాకుండా చూసేవారని, ముందస్తు చర్యలతో కరెంట్ కోతలను నివారించేవారని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలను ప్రపంచమంతా కొనియాడిందని, వ్యాక్సిన్ అందజేయడంతో పాటు వలస కూలీలను కూడా కాపాడి ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితులను వక్రీకరించి రేవంత్ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వానికి హరీశ్ రావు కీలక డిమాండ్లు
రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి పరిస్థితి , కరువు నివారణకు కేటాయించిన నిధులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటాలను పక్కనబెట్టి కరువును ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణను ప్రకటించాలని కోరారు. రైతులందరికీ సాగునీరు, ప్రజలకు తాగునీరు, మూగజీవాలకు పశుగ్రాసం, కూలీలకు ఉపాధి కల్పించాలని, నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని స్పష్టం చేశారు. రైతులకు రైతు బీమా, పంటల బీమా పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.