© vv - 2026

Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!

gunugu
gunugu Chief Editor
|
|
Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
News Clip
◉ Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన
వెంకట్!
◉ Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా 'హారర్ కామెడీ' మూవీ
◉ Sandiyar First Look: ‘సండియార్’ ఫస్ట్ లుక్ చూశారా? రఫ్ అండ్ రా లుక్‌తో కమల్ విధ్వంసం!
◉ Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్

Chandrayaan Trailer: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్, నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న సరికొత్త చిత్రం ‘చంద్రయాన్’. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ‘చంద్రయాన్’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కేవలం ఐదు దేశాలు మాత్రమే చంద్రుడిపైకి తమ స్పేస్‌క్రాఫ్ట్‌లను విజయవంతంగా పంపగలిగాయి. అలాంటి భారీ ప్రయోగాన్ని.. అస్సలు లెక్కలు, ఎక్కాలు కూడా రాని మందమర్రి అనే చిన్న ఊరిలోని నలుగురు లోకల్ కుర్రాళ్లు చేస్తే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గూగుల్ సాయంతో ఇంట్లోనే రాకెట్ తయారు చేసి, ఊరంతా తమవైపు, ప్రపంచమంతా తమ పల్లెటూరి వైపు చూసేలా చేయాలని ఈ కుర్రాళ్లు ప్లాన్ చేస్తారు.

ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయే పంచ్‌లు, ఫన్నీ సీన్లతో సాగింది. రాకెట్‌కు ఫ్యూయల్ (ఇంధనం) కోసం తవుడు వాడటం, అక్కడి వాతావరణంలో జీవం బతుకుతుందో లేదో పరీక్షించడానికి ఏకంగా ఓ కోడిని అద్దెకు తీసుకురావడం వంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సైన్స్‌కే సరికొత్త ట్విస్టులు ఇచ్చే ఈ లోకల్ సైంటిస్టుల పిచ్చి ప్రయోగాలు ఊరికి ఏదో కీడు తెచ్చిపెడతాయని గ్రామస్థులు భయపడతారు. సరిగ్గా అదే సమయంలో గ్రామంలో ఒక హత్య కేసు వెలుగులోకి రావడం, బాబా భాస్కర్ క్యారెక్టర్ ఎంట్రీతో కథలో థ్రిల్, క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఎవరూ తమ ప్రయత్నాన్ని నమ్మకపోయినా, ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా.. చేతికి దొరికిన వస్తువులతో ఈ నలుగురు కుర్రాళ్లు రాకెట్‌ను ఎలా నిర్మించారు? చివరకు తమ చంద్రయానాన్ని పూర్తి చేశారా లేదా? అన్నది తెరపై చూడాల్సిందే. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్‌ అండ్ అవుట్ ఫన్ రైడ్‌గా వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Share

మరిన్ని కథనాలు
సంక్రాంతి బాక్సాఫీస్ వార్: భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న చిత్రాలు - ప్రత్యేక తాజా కథనం #5 సినిమా

సంక్రాంతి బాక్సాఫీస్ వార్: భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న చిత్రాలు - ప్రత్యేక తాజా కథనం #5

గ్లోబల్ లెవల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న తెలుగు సినిమా టీజర్ - ప్రత్యేక తాజా కథనం #23 సినిమా

గ్లోబల్ లెవల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న తెలుగు సినిమా టీజర్ - ప్రత్యేక తాజా కథనం #23

ప్రముఖ దర్శకుడి పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ అధికారిక ప్రకటన - ప్రత్యేక తాజా కథనం #14 సినిమా

ప్రముఖ దర్శకుడి పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ అధికారిక ప్రకటన - ప్రత్యేక తాజా కథనం #14

ఓటీటీలో రికార్డు వ్యూయర్షిప్ సాధిస్తున్న బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ - ప్రత్యేక తాజా కథనం #32 సినిమా

ఓటీటీలో రికార్డు వ్యూయర్షిప్ సాధిస్తున్న బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ - ప్రత్యేక తాజా కథనం #32

స్టార్ హీరో నూతన చిత్ర ప్రారంభోత్సవం: సెట్స్ పైకి గ్రాండ్ ఎంట్రీ - ప్రత్యేక తాజా కథనం #50 సినిమా

స్టార్ హీరో నూతన చిత్ర ప్రారంభోత్సవం: సెట్స్ పైకి గ్రాండ్ ఎంట్రీ - ప్రత్యేక తాజా కథనం #50

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు చిత్రానికి ప్రత్యేక అవార్డు - ప్రత్యేక తాజా కథనం #41 సినిమా

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు చిత్రానికి ప్రత్యేక అవార్డు - ప్రత్యేక తాజా కథనం #41

భారీ వీఎఫ్‌ఎక్స్ హంగులతో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ అప్‌డేట్ - ప్రత్యేక తాజా కథనం #77 సినిమా

భారీ వీఎఫ్‌ఎక్స్ హంగులతో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ అప్‌డేట్ - ప్రత్యేక తాజా కథనం #77

టాలీవుడ్ యువ కథానాయకుడి ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం - ప్రత్యేక తాజా కథనం #68 సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడి ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం - ప్రత్యేక తాజా కథనం #68

Generating 2K HD News Clip...