Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
◉ Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ..
◉ Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
◉ Dulquer Salmaan: మేమిద్దరం 'నెపో కిడ్స్'.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
సాయిపల్లవి, శ్రీలీల కలిసి ‘ఓమ్’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల ధనుష్ భార్యగా కనిపించనుండగా.. సాయిపల్లవి నెవ్వర్ బిఫోర్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించనుంది. నిత్యా రెడ్డి అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ ఇద్దరు భామల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఓమ్ కూడా నవంబర్ 20నే విడుదల కానుంది.
‘ఆకాశంలో ఓ తార’లో శ్రుతి హాసన్ కీలక పాత్ర:
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఓ తార’ కూడా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాత్విక వీరవల్లి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నప్పటికీ.. శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె ఇందులో పవర్‌ఫుల్ సైంటిస్ట్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కాళ్లపై తాను నిలబడే ఆధునిక యువతి పాత్రలో శ్రుతి కనిపించనుందని టాక్.
హీరోయిన్ల మధ్య ఎవరిది పైచేయి?:
ఒకే రోజున మూడు సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పేలా లేదు. కీర్తి సురేష్, సాయిపల్లవి, శ్రీలీల, శ్రుతి హాసన్.. తమ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. కథ, నటన, ప్రేక్షకుల ఆదరణ.. ఈ మూడు అంశాలే సినిమాల విజయాన్ని నిర్ణయించనున్నాయి. నవంబర్ 20న జరిగే ఈ బాక్సాఫీస్ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది?.. ఏ హీరోయిన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది? అన్నది చూడాలి.